ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా సైక్లోనిక్ సర్కూలేషన్‌'.. అమరావతి వాతావరణ కేంద్రం - rains in ap

RAINS: మధ్యప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ కోస్తాంధ్ర, తెలంగాణాల మీదుగా సైక్లోనిక్ సర్కులేషన్ కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది.

amaravathi meteorological department
amaravathi meteorological department

By

Published : Jul 26, 2022, 2:15 PM IST

RAINS: మధ్యప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ కోస్తాంధ్ర, తెలంగాణాల మీదుగా సైక్లోనిక్ సర్కులేషన్ కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి తోడు రాజస్థాన్ నుంచి తూర్పు ఈశాన్య బంగాళాఖాతం వరకూ నైరుతీ రుతుపవనాల ద్రోణి అత్యంత క్రియాశీలకంగా ఉన్నట్టు అధికారులు వివరించారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రత్యేకించి కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయని వాతావరణ కేంద్రం తెలియచేసింది. మరో రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వివరించింది.

కోనసీమ: జిల్లాలోని ముమ్మిడివరంలో రెండ్రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వరదల వల్ల పది రోజులుగా ముమ్మిడివరంలోని నాలుగు లంక గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరదలు తగ్గుముఖం పట్టడంతో.. ఇంట్లోని చెత్తను శుభ్రం చేసుకునే పనుల్లో ఉండగా.. భారీ వర్షాలు వారిని మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పాడి పశువులను కట్టేందుకు పాకలు లేకపోవడంతో ఇంటి ఆవరణే వాటికి నివాసంగా మారింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details