అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చింతాలమ్మ ఘాట్ రోడ్డులో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు చెట్లు కూలడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రధానంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుంచి.. అడ్డతీగల, రాజవొమ్మంగి, మారేడుమిల్లి, తదితర ప్రాంతాల మీదుగా ఏలేశ్వరం, రాజ మహేంద్రవరం వెళ్లాల్సిన బస్సులు, ఇతర వాహనాలు నిలచి పోయాయి. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు.
పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు.. రహదారులు జలమయం - ఏపీ వర్షాలు
రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల భారీ వర్షాల కారణంగా రహదారులపై చెట్లు నేలకొరగటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రహదారులపై నీరు నిలిచిపోటంతో ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయని ప్రయాణికులు వాపోతున్నారు.
పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు
కోనసీమ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. రోడ్లపై ఉన్న గుంతల్లో నీరు నిలిచిపోవడంతో రహదారులు ప్రమాదకరంగా మారాయని ప్రయాణికులు వాపోతున్నారు. జిల్లాలో అత్యధికంగా అల్లవరంలో 134.60 మిల్లీ మిటర్లు నమోదు కాగా..అత్యల్పంగా కపిలేశ్వరంలో 13.20 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతవరణశాఖ అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి :