కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కోస్తాంధ్ర వరకూ ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నట్టు అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల వ్యవధిలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆకాశం మేఘావృతం..
ఇవాళ, రేపు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వెల్లడించింది. చాలాచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని స్పష్టం చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలియజేశారు.
ఉరుములతో కూడిన జల్లులు..
ఉత్తర కోస్తాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.