రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలిక పాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు తీరం వద్ద శ్రీలంక ప్రాంతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని.. ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని స్పష్టం చేసింది. రాగల 2-3 రోజుల్లో పశ్చిమదిశగా అల్పపీడనం ప్రయాణించే అవకాశముందని తెలిపింది.
అల్పపీడన ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతవరణశాఖ స్పష్టం చేసింది. ఇవాళ, రేపు దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.