ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో పలుచోట్ల ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం

రాష్ట్రంలో పలుచోట్ల భారీ ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా మన్యం జిల్లాలో వృక్షాలు నేలకొరిగాయి. సత్యసాయి జిల్లా హిందూపురంలో అరగంటపాటు కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

ఉరుములతో కూడిన వర్షం
ఉరుములతో కూడిన వర్షం

By

Published : May 5, 2022, 9:04 PM IST

అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం కారణంగా అచ్యుతాపురం, ఎలమంచిలి, చీడికాడలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అల్లూరి జిల్లాలో పలు చోట్ల ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అరకు మండలం బొండం గ్రామంలో వడగళ్ల వాన కురిసింది. పార్వతీపురం, సీతంపేట, కురుపాం, సీతానగరం, కొమరాడ, జియ్యమ్మవలస, బలిజపేట, వీరఘట్టం, గరుగుబిల్లిలో వర్షం పడింది. భారీ ఈదురు గాలులతో పలుచోట్ల వృక్షాలు నెలకొరిగాయి.

ఎండ తీవ్రత, తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణ వాసులకు కాస్త ఊరట లభించింది. గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.అయితే అరగంట పాటు కురిసిన వర్షానికి పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. బాలాజీ సర్కిల్ వాసవి ధర్మశాల రోడ్డు ప్రధాన కూడళ్లలో మురుగు నీరు రోడ్లపై ప్రవహించటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుమడలో రైల్వే ట్రాక్‌పై భారీ వృక్షం కూలింది. దీంతో టాటానగర్-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ (18189) నిలిచిపోయింది. పార్వతీపురం స్టేషన్‌లో రెండున్నర గంటలుగా ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. చెట్టు తొలగించేందుకు రాయగఢ నుంచి సహాయ సిబ్బంది రావాల్సి ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: ఓ వైపు సీఎం సభ జరుగుతుండగానే.. మరోవైపు గోడ దూకి..

ABOUT THE AUTHOR

...view details