ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వర్షం ప్రభావం: నెమ్మదిగా నడుస్తున్న హైదరాబాద్ మెట్రోరైళ్లు - హైదరాబాద్​ మెట్రో రైలు వార్తలు

హైదరాబాద్​లో భారీ వర్షం కారణంగా మెట్రో సేవలు నెమ్మదించాయి. వర్షం, గాలితో పలు చోట్ల కొద్దిసేపు మెట్రో రైళ్లు నిలిచిపోయాయి.

వర్షం ప్రభావం: నెమ్మదిగా నడుస్తున్న మెట్రోరైళ్లు
వర్షం ప్రభావం: నెమ్మదిగా నడుస్తున్న మెట్రోరైళ్లు

By

Published : Oct 13, 2020, 10:37 PM IST

భారీ వర్షాల ప్రభావం మెట్రో సేవలపై కూడా పడింది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయం కాగా.. చాలామంది నగరవాసులు మెట్రోను ఆశ్రయించారు. కానీ భారీవర్షాలు, ఈదురుగాలులతో మెట్రో సేవలు నెమ్మదించాయి.

అమీర్‌పేట్ - ఎల్బీ నగర్ మార్గంలో మెట్రో రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయి. భారీ వర్షాలు, గాలి కారణంగా అక్కడక్కడ కొద్దిసేపు మెట్రో సేవలు నిలిపివేశారు. భారీ వర్షంతో మూసారంబాగ్ స్టేషన్‌లో కాసేపు మెట్రో రైలు నిలిచిపోయింది. వర్షాలతో అందరూ మెట్రోను ఆశ్రయించడంతో.. రైల్వేస్టేషన్లు కిటికిటలాడుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details