ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఏపీ ప్రభుత్వం నిధులిస్తే రైల్వే ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తాం' - ఏపీలో రైల్వే ప్రాజెక్ట్​లపై రైల్వే మంత్రి

రైల్వే ప్రాజెక్టుల పూర్తికి ఏపీ నుంచి బకాయిలు ఇప్పించాలని.. నిధులిస్తే రైల్వే ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతాయని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్ స్పష్టం చేశారు. లోక్​సభలో వైకాపా ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆయన..ఏపీ నుంచి రూ.1,200 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని వెల్లడించారు.

ఏపీ ప్రభుత్వం నిధులిస్తే రైల్వే ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తాం
ఏపీ ప్రభుత్వం నిధులిస్తే రైల్వే ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తాం

By

Published : Mar 16, 2021, 9:42 PM IST

రైల్వే ప్రాజెక్టుల పూర్తికి ఏపీ నుంచి బకాయిలు ఇప్పించాలని.. నిధులిస్తే రైల్వే ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతాయని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్ స్పష్టం చేశారు. లోక్​సభలో వైకాపా ఎంపీలు లావుకృష్ణదేవరాయలు, శ్రీనివాసులురెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ప్రాజెక్టు పనులకు ఏపీ సహకారం, భూమి అవసరం ఉందన్నారు. సంయుక్త ప్రాజెక్టుల వాటాను ఏపీ త్వరగా సమకూర్చాలన్నారు. ఏపీ నుంచి రూ.1,200 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని వెల్లడించారు.

పసుపు, మిరప, మసాలా దినుసుల రవాణా కోసం గుంటూరు జిల్లా నుంచి కిసాన్‌ రైలు నడపాలని ఎంపీ కృష్ణదేవరాయలు కోరగా..రైలు నడపడం సాధ్యం కాదని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. ఏపీలో ఆయా పంటలు తక్కువ కావున రైలు సాధ్యం కాదన్నారు. పసుపు, మిరప పార్సిల్‌లో తీసుకెళ్లేందుకు సిద్ధమని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details