ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పండగ ఎఫెక్ట్​.. రైల్వే స్టేషన్లలో ప్లాట్​ ఫాం టికెట్​ ధర పెంపు - దసరా రద్దీ

Railway: దసరా పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు రైల్వే ప్లాట్​ ఫాం టికెట్​ ధరను పెంచారు. తాత్కాలికంగా ఈ ధరలను అధికారులు పెంచారు. శుక్రవారం నుంచే పెంచిన ధరలు అమలులోకి రానున్నాయి.

Platform Ticket Rates
ప్లాట్​ ఫాం టికేట్​

By

Published : Sep 29, 2022, 10:55 PM IST

Railway Platform Ticket Rates: రైల్వే స్టేషన్​లో అనవసర రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ప్లాట్​ ఫాం టికెట్ ధరలను పెంచింది. ఈ పెంపు శుక్రవారం నుంచే అక్టోబర్ 9 వరకు అమలులో ఉండనుంది. దసరా రద్దీ దృష్ట్యా.. అనవసర రద్దీని తగ్గించేందుకు తాత్కాలికంగా ప్లాట్​ ఫాం ధరలను రైల్వే అధికారులు పెంచారు. పెంచిన ప్లాట్ ఫాం ధరలను రూ.10 నుంచి రూ.30 వరకు పెంచాయి.

విజయవాడ రైల్వే స్టేషన్​లో గతంలో 10 రూపాయలు ఉంటే ప్రస్తుతం 30కి పెంచారు. గుంటూరులో 10 రూపాయల నుంచి 20కి పెంచారు. ఈ పెంచిన ధరలు ఈ నెల 30 నుంచి అక్టోబర్​ 9 వరకు మాత్రమే అమలులో ఉంటాయి. సొంత ఊర్లకు వెళ్లే వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు.. ప్లాట్​ ఫాంపైన రద్దీని నియంత్రించేందుకు ఈ ధరలు పెంచినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు పెంచిన ధరలకు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details