ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

GAJANAN MALLYA: రాష్ట్ర ఎంపీలతో ద.మ. రైల్వే జీఎం గజానన్ మల్యా భేటీ

Railway GM
Railway GM

By

Published : Sep 30, 2021, 11:20 AM IST

Updated : Sep 30, 2021, 1:09 PM IST

11:19 September 30

Railway GM meets state MPs TAZA

రాష్ట్రానికి చెందిన ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మల్యా సమావేశం అయ్యారు. రైళ్లు, స్టేషన్లలో సౌకర్యాలు, సమస్యల పరిష్కారంపై చర్చిస్తున్నారు. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల ప్రగతిపై సమావేశంలో మాట్లాడుతున్నారు. బడ్జెట్ కేటాయింపులపై ఎంపీల ప్రతిపాదనలు  రైల్వే జీఎం తీసుకోనున్నారు. కొత్త రైళ్లు, రైల్వే లైన్ల నిర్మాణంపై ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. 

పెండింగ్​లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు సహా బడ్జెట్ కేటాయింపులపై చర్చించేందుకు.. రాష్ట్రానికి చెందిన ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మల్యా సమావేశం నిర్వహించారు. విజయవాడ సత్యనారాయణపురంలోని రైల్వే ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభమైంది. అన్ని జిల్లాల్లోని పార్లమెంట్ సభ్యులు వారి ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు సహా బడ్జెట్ ప్రతిపాదనలను తీసుకుని రావచ్చని రైల్వే అధికారులు ముందుగానే ఆహ్వానాలు పంపారు.

రైల్వే వ్యవస్థను ఆధునికీకరించేందుకు అవసరమైన సలహాలు, సూచనలను తీసుకుంటున్నారు. ప్రస్తుతం రైల్వే బడ్జెట్​లో కేటాయించిన నిధులు వ్యయం సహా... వచ్చే బడ్జెట్​లో ఏ ప్రాజెక్టుకు ఎంత నిధులు కావాలో ప్రతిపాదనలను ఎంపీలు సమావేశంలో తెలియజేయనున్నారు. రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాల కల్పన, పలు స్టేషన్ల గ్రేడింగ్ పెంపు, పలు మార్గాల్లో కొత్త లైన్లు వేయడం, డబ్లింగ్, విద్యుదీకరణ ,కొత్త రైళ్లు నడపడం సహా కొత్తగా రైళ్ల స్టాపులు ఏర్పాటు, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాల కల్పన తదితర అంశాలపై జీఎంతో ఎంపీలు చర్చిస్తున్నారు. సమావేశంలో ఎంపీల ఇచ్చిన ప్రతిపాదనలన్నింటినీ తీసుకున్న అనంతరం దక్షిణ మధ్య రైల్వే సమగ్ర ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు పంపనుంది.

ఇదీ చదవండి: గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం

Last Updated : Sep 30, 2021, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details