అఖిల భారత కిసాన్ కో ఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు ఫిబ్రవరి 18న రాష్ట్రవ్యాప్తంగా రైల్ రోకో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన రైతు సంఘాల సమావేశంలో.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేశామని అన్నారు.
'రైతులను అవమానించేలా ప్రధాని వ్యాఖ్యలు తగదు' - విజయవాడ్ తాజా వార్తలు
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 18న రాష్ట్రవ్యాప్తంగా రైల్ రోకో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. విజయవాడలో ఏర్పాటు చేసిన రైతు సంఘాల సమావేశంలో పలు తీర్మానాలు చేశామని పేర్కొన్నారు.

'రైతులను అవమానించేలా ప్రధాని వ్యాఖ్యలు చేయడం తగదు'
అందులో భాగంగా మార్చిలో గ్రామ సభలు నిర్వహంచి.. తీర్మానాలు చేయిస్తామన్నారు. రైతులు 80 రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్నా.. వారిని అవమానించేలా ప్రధాని వ్యాఖ్యలు చేయడం తగదని శోభనాద్రీశ్వరరావు తెలిపారు.
నల్ల చట్టాలను వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయడానికి సుప్రీం కోర్టులో కేసు వేసినప్పటికీ.. నిబంధనలను అతిక్రమించి పార్లమెంట్లో వ్యవసాయ చట్టాలను ఆమోదించారని మండిపడ్డారు. ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాలను కొట్టివేయలని కోరుతూ.. కేసు వేశామని పేర్కొన్నారు.