మమతా బెనర్జీ తిరస్కరించాక కేకే ఏపీకీ బదిలీ
కేకే శర్మను బదిలీ చేయండి - RTC CHAIRMAN
భాజపా, ఆర్ఎస్ఎస్ సానుభూరి పరుడైన కేకే శర్మ సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్ గా ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే ఎన్నికలు సజావుగా జరగవని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు కేకే శర్మను ఏపీ నుంచి బదిలీ చేయాలని కోరినట్లు తెలిపారు.
ఈ నెల 27 వ తేదీన కేకే శర్మను సెంట్రల్ పోలీసు అబ్జర్వర్‌గా పశ్చిమ బంగా కు నియమిస్తే, ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ, కమ్యూనిస్టు పార్టీలు ఒప్పుకోలేదన్నారు. కేకే శర్మ భాజపా, ఆర్ఎస్ఎస్ సానుభూతిపరుడు అని, ఫోటో ఆధారాలతో మమతా బెనర్జీ, ఇతర పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేస్తే పశ్చిమ బంగా నుంచి ఏపీకి బదిలీ చేశారని అన్నారు. దేశంలో ఎక్కడ కూడా కేకే శర్మను సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్‌గా నియమించేందుకు వీలు లేదని వర్ల రామయ్య అన్నారు.
రాష్ట్ర పోలీస్ శాఖ మొత్తం సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్ చేతిలో ఉంటుందన్న ఆయన... ఏపీ నుంచి వెళ్లిపోవాలని కేకే శర్మను కలిసి ఆయనకే ఫిర్యాదు చేశామని తెలిపారు.