ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా: రాహుల్​ - rahul gandi

అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్​గాంధీ స్పష్టం చేశారు. ఐదేళ్లుగా మోదీ ప్రధానిగా ఉండి హామీ అమలు చేయలేకపోయారని విమర్శించారు.

కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్​గాంధీ

By

Published : Mar 31, 2019, 12:59 PM IST

కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్​గాంధీ
రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన... కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. దేశంలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని వ్యాఖ్యానించారు. హోదా అంశంపై రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. ఐదేళ్లుగా మోదీ ప్రధానిగా ఉండి హామీ అమలు చేయలేకపోయారని విమర్శించారు. హోదా విషయంలో మోదీ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details