ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నాకేం జరిగినా.. రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్‌, డీజీపీదే బాధ్యత: ఎంపీ రఘురామ - Raghu Rama Krishna Raju news

MP RRR: 'ఆంధ్రా పోలీసులు.. అర్ధరాత్రి అరాచకాలు చేస్తున్నారు. నాకేం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్‌, డీజీపీదే బాధ్యత' అని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రాష్ట్రంలో పోలీసుల నుంచే రక్షణ కోరే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు.

MP RRR comments on ap government
MP RRR comments on ap government

By

Published : Jun 30, 2022, 4:08 PM IST

MP Raghu Rama Krishna Raju News: ఆంధ్రా పోలీసులు.. అర్ధరాత్రి అరాచకాలు చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసుల నుంచే రక్షణ కోరే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. నాకేం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్‌, డీజీపీదే బాధ్యత అని రఘురామ పేర్కొన్నారు. భీమవరం వెళ్లకుండా నన్ను అడ్డుకుంటున్నారన్న రఘురామ.. దీనిపై హైకోర్టులో రేపు లంచ్ మోషన్‌ పిటిషన్ దాఖలు చేస్తాని చెప్పారు.

'సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టు చేస్తారా?. కనీసం నోటీసులు కూడా లేకుండా అరెస్టు ఎలా చేస్తారు. ఉద్యోగుల ఖాతాల్లో నుంచి జీపీఎఫ్ డబ్బులు లాగేశారు. డీఏ బకాయిలు చెల్లించామని అందమైన అబద్ధం చెప్పారు. రూ.800 కోట్లు పొరపాటున తీసేశామంటున్నారు. ఒక్క అవకాశమంటూ అధికారం చేపట్టి ఇప్పుడు ఇలా చేయడం మంచిది కాదు' అని రాష్ట్రప్రభుత్వంపై ఎంపీ రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:'ఐబీపీఎస్​' నోటిఫికేషన్​ వచ్చేసింది.. వేల ఉద్యోగాలు.. మంచి జీతం!

ABOUT THE AUTHOR

...view details