ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చంద్రబాబు స్థాయికి తగ్గట్లు మాట్లాడాలి.. నన్ను రాజ్యసభకు పంపితే తప్పేంటి?' - చంద్రబాబు న్యూస్

ముఖ్యమంత్రి జగన్​ను విమర్శించే ముందు తెదేపా బీసీల కోసం ఏం చేసిందో చెప్పాలని రాజ్యసభ వైకాపా అభ్యర్థి ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్​తో పాటు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బీసీల అభివృద్ధికి జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు.

చంద్రబాబు స్థాయికి తగ్గట్లు మాట్లాడాలి
చంద్రబాబు స్థాయికి తగ్గట్లు మాట్లాడాలి

By

Published : May 31, 2022, 7:55 PM IST

R.Krishnaiah on TDP: తెదేపా అధినేత చంద్రబాబుపై రాజ్యసభ వైకాపా అభ్యర్థి, బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య విమర్శనాస్త్రాలు సంధించారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. తన స్థాయికి తగినట్టుగా మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణాలో బీసీ జాబితా నుంచి తొలగించిన కులాల కోసం పోరాటం చేసింది తామేనని చెప్పుకొచ్చారు. బీసీ సబ్ ప్లాన్​తో పాటు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బీసీల అభివృద్ధికి జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. జగన్​ను విమర్శించే ముందు తెదేపా బీసీల కోసం ఏం చేసిందో చెప్పాలన్నారు. గతంలోనూ చంద్రబాబు ఇతర రాష్ట్రాలకు చెందిన సురేశ్ ప్రభు, నిర్మలా సీతారామన్​లను రాజ్యసభకు పంపారని కృష్ణయ్య గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి చెందిన తనను రాజ్యసభకు పంపితే తప్పేంటని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details