వచ్చే జూన్ నెలలోపు రాష్ట్రంలో 8 వేల కిలోమీటర్లు రహదారులకు మరమ్మతులు పూర్తి చేస్తామని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ తెలిపారు. రుణంగా తీసుకున్న రూ. 2 వేల 200 కోట్లును మరమ్మతుల కోసం ఖర్చు చేయనున్నట్లు మంత్రి చెప్పారు.
'వచ్చే జూన్‌లోగా 8 వేల కిలోమీటర్లు రోడ్లకు మరమ్మతులు పూర్తి చేస్తాం'
వచ్చే జూన్‌లోగా రాష్ట్రంలో 8 వేల కిలోమీటర్లు రహదారుల మరమ్మతులు పూర్తి చేస్తామని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ తెలిపారు.
మంత్రి శంకర్ నారాయణ
మూడేళ్లలో 284 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లను పూర్తి చేశామని.. 2వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మాణ దశలో ఉన్నాయని మంత్రి వివరించారు. గత ప్రభుత్వం మరమ్మతుల కోసం 5 ఏళ్లలో పెట్టిన ఖర్చు కంటే ఎక్కువగా మూడేళ్లలోనే వైకాపా ఖర్చు చేసిందన్నారు. రూ.1158 కోట్లు నా బార్డు ద్వారా తీసుకొని 233 ప్లాన్ వర్కులను పూర్తి చేస్తామన్నారు.
ఇదీ చదవండి:చేనేత రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది: గవర్నర్ భిశ్వభూషణ్