'బ్యాడ్మింటన్ కోర్టులోనే ఆడాలి.. అప్పుడే గెలుస్తాం. కరోనాతో ఫైట్ చేయాలంటే మనం ఇంట్లోనే ఉండాలి... భౌతికదూరం పాటిస్తేనే కొవిడ్-19పై విజయం సాధించగలం.. మనకు సహాయం అందించడానికి 104 హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ సూచనలు పాటిద్దాం.. ఇంట్లోనే ఉందాం.. కరోనాను కలిసి ఎదుర్కొందాం' అని పీవీ సింధు పిలుపునిచ్చారు.
'కరోనాతో ఫైట్ చేయాలంటే ఇంట్లోనే ఉండాలి' - కరోనాపై పీవీ సింధు సందేశం న్యూస్
'ఇంట్లోనే ఉందాం.. కరోనాను ఎదుర్కొందాం’ అని పిలుపునిచ్చారు ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు. ఇటీవల విదేశాల్లో బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొని స్వదేశం రాగానే స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు.
కరోనాతో ఫైట్ చేయాలంటే ఇంట్లోనే ఉండాలి
నిన్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశంలోని 40 మంది ప్రముఖ క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా పరిస్థితిపై చర్చించారు. క్రీడాకారులంతా వారి సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా కొవిడ్-19కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో పీవీ సింధు కరోనాపై వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్‌లో కరోనా నిర్ధరణ పరీక్ష!