ఛత్తీస్గఢ్ రాష్ట్ర భాజపా ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి పురందేశ్వరి ఆ రాష్ట్రానికి వెళ్లారు. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు విష్ణువిశాల్ దేవ్, రాయ్పూర్ ఎంపీ సునీల్ సోనీజీ సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పురందేశ్వరికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భాజపా కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చి ర్యాలీ నిర్వహించారు. ఇటీవలే పురందేశ్వరి ఛత్తీస్గఢ్, ఒడిశా ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు.
ఛత్తీస్గఢ్లో పురందేశ్వరి పర్యటన
భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి.. ఇన్ఛార్జి హోదాలో తొలిసారి ఛత్తీస్గఢ్లో పర్యటించారు. అక్కడి కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
ఛత్తీస్గఢ్ పర్యటనలో పురందేశ్వరి