ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి కక్ష సాధింపుపై దృష్టి సారించింది' - ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి కక్ష సాధింపుపై దృష్టి సారించింది

రాష్ట్ర నిర్మాణం, అభివృద్ధి విషయాల్లో భారతీయ జనతా పార్టీ ఎంతో చిత్తశుద్ధితో సహకరిస్తుందని ఆ పార్టీ నాయకురాలు పురంధేశ్వరి స్పష్టం చేశారు. అన్ని వర్గాలు నిలదొక్కుకునేందుకు, పురోగతి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని... దానిని అందరూ అందిపుచ్చుకోవాలని సూచించారు.

'ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి కక్ష సాధింపుపై దృష్టి సారించింది'
'ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి కక్ష సాధింపుపై దృష్టి సారించింది'

By

Published : Jul 10, 2020, 8:49 PM IST

రాష్ట్రంలో ప్రజలు అసహనంతో ఉన్నారని, ప్రస్తుత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని కాకుండా కక్ష సాధింపు చర్యల వైపు దృష్టి సారించిందని భాజాపా నాయకురాలు పురంధేశ్వరి ఆరోపించారు. రాష్ట్ర నిర్మాణం, అభివృద్ధి విషయాల్లో భారతీయ జనతా పార్టీ ఎంతో చిత్తశుద్ధితో సహకరిస్తుందని స్పష్టం చేశారు. అన్ని వర్గాలు నిలదొక్కుకునేందుకు, పురోగతి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని... దానిని అందరూ అందిపుచ్చుకోవాలని సూచించారు.

సమస్యల్లో ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడి దానిని ఎదుర్కొనేవాడే అసలైన నాయకుడని... ప్రధాని మోదీ అలాంటి నేతగా ప్రజల హృదయాల్లో నిలుస్తారన్నారు. లాక్‌డౌన్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి కోలుకునేలా చేసేందుకు ప్రజలకు ధైర్యం చెప్పి ప్రోత్సహించడంలో కేంద్రం సమర్ధవంతంగా పనిచేసిందన్నారు. గతంలో విదేశాల నుంచి పీపీఈ కిట్లు, వెంటిలేటర్ల దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామన్నారు.

ABOUT THE AUTHOR

...view details