పులివెందులలో సిటీ సెంట్రమ్ ఐకానిక్ నిర్మాణానికి అంచనాలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిటీ సెంట్రమ్ నిర్మాణం అంచనాలను రూ.57 కోట్ల నుంచి రూ.75 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులను వెచ్చించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జేకే రోడ్డు నుంచి నాలుగు లేన్ల రహదారి, రింగురోడ్డు, రాయలపురం వద్ద 4 లేన్ బ్రిడ్జి నిర్మాణం కోసం 25 కోట్ల రూపాయల మేర వెచ్చించాలని నిర్ణయించారు. పులివెందులను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దేందుకు 633 కోట్ల రూపాయలను బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది.
పులివెందుల సిటీ సెంట్రమ్ ఐకానిక్ నిర్మాణం అంచనాలు సవరణ - కడప జిల్లా తాజా వార్తలు
పులివెందులలో సిటీ సెంట్రమ్ ఐకానిక్ నిర్మాణానికి అంచనాలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణం అంచనాలను రూ.57కోట్ల నుంచి 75 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
సిటీ సెంట్రమ్ ఐకానిక్ నిర్మాణం అంచనాలు సవరించిన ప్రభుత్వం