పులిచింతల ప్రాజెక్టులో నీటిని తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించటంపై.. ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో నీటిని కరెంటు ఉత్పత్తి కోసం అనధికారికంగా వాడటం సరికాదని తెలంగాణ జెన్కోకు.. పులిచింతల ప్రాజెక్టు అధికారులు లేఖ రాశారు. ఎగువ నుంచి వస్తున్న నీటిని నిల్వ చేయకుండా.. విద్యుత్ ఉత్పత్తి పేరిట కిందకు వదిలివేయటం సరికాదని లేఖలో పేర్కొన్నారు. ఈనెల 29 రాత్రి నుంచి తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తోందని.. పులిచింతల అధికారులు చెబుతున్నారు.
పులిచింతల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 19.26 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి 30వేల క్యూసెక్కుల మేర నీరు వస్తోంది. జలాశయం పూర్తిగా నిండకుండా విద్యుత్ ఉత్పత్తి చేయరు. ఒకవేళ కరెంటు ఉత్పత్తి చేయాలని భావించినా.. ఏపీ అధికారులకు సమాచారం ఇవ్వాలి. కానీ అలాంటిదేమీ లేకుండానే.. విద్యుదుత్పత్తి చేయటం సరికాదని నీటిపారుదలశాఖ అధికారులు అంటున్నారు. తెలంగాణా జెన్కో తరపున.. పులిచింతల ప్రాజెక్టులో 24మెగావాట్ల మేర విద్యుదుత్పత్తి చేస్తున్నారని అధికారులు తెలిపారు.
స్పందించిన తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి