ఆస్తి పన్ను పెంపు, మంచి నీరు, డ్రైనేజీ, చెత్తపై పన్నుల భారాలకు నిరసనగా విజయవాడ ధర్నా చౌక్‌లో పట్టణ పౌర సమాఖ్య ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు కోసం పట్టణ పౌరులపై పెనుభారాలు పన్నుల రూపంలో మోపడం దారుణమని.. పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ సీహెచ్ బాబూరావు అన్నారు. ప్రపంచమంతా కరోనా కష్టకాలంలో ఉద్దీపన పథకాలు ప్రవేశపెడుతూ ఉండగా.. రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల పేరుతో ప్రజల జేబులు ఖాళీ చేసే విధానాలను ప్రవేశపెట్టడం సిగ్గుచేటన్నారు.
పన్ను పెంపు జీవోలను రద్దు చేయాలని నిరసన - పన్ను పెంపు జీవోలను రద్దు చేయాలని నిరసన వార్తలు
ప్రజలపై భారం మోపే 196, 197, 198 జీవోలను రద్దు చేయాలని.. విజయవాడ ధర్నా చౌక్‌లో పట్టణ పౌర సమాఖ్య ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తక్షణమే జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

పన్ను పెంపు జీవోలను రద్దు చేయాలని నిరసన
దేవాలయాలపై దాడులు విషయంలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్న భాజపా, వైకాపాలు ఇంటి పన్ను విషయంలో మాత్రం కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. తక్షణమే పన్ను పెంపు జీవోలు 196 ,197 ,198 లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. భోగి రోజున జీవో కాపీలను భోగిమంటల్లో తగలబెట్టి నిరసన తెలుపుతామన్నారు.
ఇదీ చదవండి: