ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'గ్రూప్ 2, 3 పరీక్షా ఫలితాలు రద్దు చేయాలి' - protest at appsc office for cancellation on group 2 results

ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద గ్రూప్ 2, 3 పరీక్షా ఫలితాలను రద్దు చేసి... ప్రధాన పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని నిరుద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టాయి

ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద నిరుద్యోగ సంఘాలు  ఆందోళన

By

Published : Aug 5, 2019, 5:47 PM IST

ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద నిరుద్యోగ సంఘాలు ఆందోళన

ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద నిరుద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టాయి. గ్రూప్ 2, 3 పరీక్షా ఫలితాలను రద్దు చేసి... ప్రధాన పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే జీవో నెం.5ను రద్దు చేయాలని... అదేవిధంగా గ్రామ, వార్డు సచివాలయాల నియామకాల్లో వయోపరిమితిని 46ఏళ్లకు పెంచాలని కోరారు. వీఆర్వో పోస్టులకు ఇంటర్, డిగ్రీ చదివిన వాళ్లకు సైతం అర్హత కల్పించాలని నినాదాలు చేశారు. అగ్రవర్ణకులాల్లో పేదలకు కల్పించే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్​ వెంటనే అమలు చేయాలని కోరారు. ప్లకార్డులతో నినాదాలు చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

For All Latest Updates

TAGGED:

protest

ABOUT THE AUTHOR

...view details