Protest: ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. బ్యాంకు ఉద్యోగులు నిరసన చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో.. బ్యాంకు ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు నినాదాలు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో యూఎఫ్బీయూ(U.F.B.U) ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు నిరసన ర్యాలీ చేశారు. బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Protest: ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే.. చూస్తూ ఊరుకోం - ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ
Protest: ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. బ్యాంకు ఉద్యోగులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాన్ని నిరసించిన ఉద్యోగులు.. బ్యాంకులు ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు చేపట్టిన సమ్మె.. కర్నూలు జిల్లాలో రెండో రోజు కొనసాగుతుంది. నగరంలోని సీ క్యాంపు వద్దనున్న ఇండియన్ బ్యాంకు ముందు బ్యాంకు ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్యాంకులను ప్రైవేటీకరణ చేసే ప్రజల సొమ్ముకు భద్రత ఉండదని బ్యాంక్ ఉద్యోగ నాయకులు తెలిపారు.
బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ప్రైవేటీకరణను చేయడం వల్ల పారిశ్రామిక వేత్తలకు మేలు జరుగుతుందని.. ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు తెలుగు దేశం పార్టీ నాయకులు గౌరు వెంకటరెడ్డి, వామపక్ష పార్టీల నేతలు మద్దతు తెలిపారు.
ఇదీ చదవండి:Farmers on Mahodyama Sabha: 'అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకూ పోరాడతాం'