వైకాపా నాయకుల నుంచి కొండపల్లి అడవులను ముఖ్యమంత్రి జగన్ కాపాడాలని... విజయవాడ ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ ప్రశంసలు పొందిన ప్రాచీన కళ కొండపల్లి బొమ్మల తయారీ అని గుర్తుచేశారు. అలాంటి అరుదైన ప్రపంచ ప్రఖ్యాత బొమ్మలు తయారు చేయడానికి ఉపయోగించే తెల్ల పుణికి కలప కొండపల్లి అడవులలో మాత్రమే దొరుకుతుందని తెలిపారు.
కొండపల్లి అడవులను కాపాడండి: కేశినేని నాని - Kesineni nani latest news
కొండపల్లి అడవులను కాపాడాలని ముఖ్యమంత్రి జగన్ను ఎంపీ కేశినేని నాని కోరారు. ప్రధానమంత్రి మోదీ ప్రశంసలు పొందిన ప్రాచీన కళ కొండపల్లి బొమ్మల తయారీ అని గుర్తుచేశారు.
కేశినేని నాని ట్వీట్