ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TRANSFERS: జిల్లా జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు - జడ్జీల బదిలీలు

రాష్ట్రవ్యాప్తంగా 36 మంది అదనపు జిల్లా జడ్జిల పదోన్నతి, బదిలీ
రాష్ట్రవ్యాప్తంగా 36 మంది అదనపు జిల్లా జడ్జిల పదోన్నతి, బదిలీ

By

Published : Sep 23, 2021, 8:20 PM IST

Updated : Sep 24, 2021, 12:12 AM IST

20:07 September 23

JUDGES TRANSFER ORDERS BY HIGH COURT

రాష్ట్ర వ్యాప్తంగా పలువురు జిల్లా జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు(JUDGES TRANSFER ORDERS BY HIGH COURT) జారీచేసింది. పలువురికి పదోన్నతి కల్పించింది. చిత్తూరు జిల్లా మదనపల్లి రెండో అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తేన్న వైవీఎస్ బీజీ పార్ధసారధిని చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఇప్పటి వరకు చిత్తూరు పీడీజేగా సేవలు అందించిన ఏవీ రవీంద్రబాబును.. గుంటూరు జిల్లా పీడీజేగా బదిలీ చేశారు. కడప ఆరో అదనపు జిల్లా జడ్జి బి.సాయికల్యాణ్ చక్రవర్తిని విజయనగరం పీడీజేగా నియమించారు. విజయనగరం పీడీజే జి.గోపిని శ్రీకాకుళం జిల్లా పీడీజేగా బదిలీ చేశారు. శ్రీకాకుళం పీడీజే జి. రామకృష్ణను కృష్ణాజిల్లా పీడీజేగా నియమించారు. వీరితో పాటు పలువురు అదనపు జిల్లా జడ్జిలకు వివిధ ప్రాంతాలకు బదిలీ చేసి పోస్టింగ్ ఇచ్చారు. హైకోర్టు రిజిస్ట్రార్ సునీత ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.

ఇదీ చదవండి: 

HC: బ్రహ్మంగారిమఠం పీఠాధిపతిని నిర్ణయించండి..హిందూ ధార్మిక పరిషత్​కు హైకోర్టు ఆదేశం

Last Updated : Sep 24, 2021, 12:12 AM IST

ABOUT THE AUTHOR

...view details