professor sexuval harassment : విజయవాడ దంత వైద్య కళాశాలలో విద్యార్థినిపై.. ఓ అసోసియేట్ ప్రొఫెసర్ లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై.. కళాశాలలో విచారణ ప్రారంభమైంది. బాధిత విద్యార్థిని మూడు రోజుల క్రితమే.. విజయవాడ మాచవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లు సమాచారం.
అయితే.. విచారణ చేస్తామని కళాశాల ప్రిన్సిపల్ హామీ ఇవ్వడంతో ఆమె వెనుదిరినట్టు తెలుస్తోంది. అనంతరం ఈ ఘటనపై డీఎంఈకి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు మంగళవారం దంతవైద్య కళాశాలలో ముగ్గురు వైద్యుల బృందంతో అంతర్గత విచారణ చేపట్టారు.