ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Tammareddy Bharadwaja: టికెట్ల వివాదం సినీ పరిశ్రమలో చిన్న సమస్యే: తమ్మారెడ్డి

Tammareddy Bharadwaja: సినీ పరిశ్రమలో టికెట్ల వివాదం సినీ పరిశ్రమలో చిన్న సమస్యేనని.. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. టికెట్ల ధర పెంపు కంటే.. స్క్రీన్ల పెంపుతో నిర్మాతలకు ఆదాయం ఉంటుందని తెలిపారు.

producer Tammareddy Bharatwaj speaks over cinema tickets issue
ప్రభుత్వంతో సినీ పెద్దలు సామరస్యపూర్వకంగా చర్చించాలి: తమ్మారెడ్డి

By

Published : Feb 9, 2022, 3:43 PM IST

Updated : Feb 9, 2022, 5:22 PM IST

Tammareddy Bharadwaja: సినిమా టికెట్ల అంశంపై.. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ప్రభుత్వంతో సినీ పెద్దలు సామరస్యపూర్వకంగా చర్చించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. టికెట్ల వివాదం అనేది సినీ పరిశ్రమలో చిన్న సమస్యే అని అన్నారు. టికెట్ల ధర పెంపు కంటే స్క్రీన్ల పెంపుతో నిర్మాతలకు ఆదాయం మంచిగా ఉంటుందన్నారు.

ప్రభుత్వంతో సినీ పెద్దలు సామరస్యపూర్వకంగా చర్చించాలి: తమ్మారెడ్డి
మినీ థియేటర్లను ప్రోత్సహించాలి..తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నంది అవార్డులు ఇవ్వడం ఆపేశారన్న ఆయన.. ఈ విషయంపై ఇరు రాష్ట్రాలూ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తెలంగాణకు సంబంధించి లొకేషన్‌ ఛార్జీలు తీసేయాలని.. ఆంధ్రాలో మాదిరిగానే చేయాలని కోరినట్లు తెలిపారు. మినీ థియేటర్లను ప్రోత్సహించాలన్నారు. రెవెన్యూ లేకపోగా.. జీఎస్టీ కోతలు పెడుతున్నారన్న ఆయన.. థియేటర్లకు విద్యుత్‌ ఛార్జీలు కమర్షియల్‌ కింద కాకుండా చూడాలని కోరారు. సినీ పరిశ్రమకు రాయితీలు కూడా ఇవ్వాలన్నారు.

ఆన్‌లైన్ బుకింగ్ విధానాం సానుకూలం..
ఆన్‌లైన్ బుకింగ్ విధానాన్ని స్వాగతిస్తున్నామన్న ఆయన.. దోపిడీలు తొలుగుతాయన్నారు. ఎఫ్‌డీసీతో కలిసి ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ ఉండాలని సూచించారు.
చిన్న సినిమాలకూ ఐదో ఆట అవకాశం ఇవ్వాలని తమ్మారెడ్డి సూచించారు.

Last Updated : Feb 9, 2022, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details