ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డీజీపీ సవాంగ్​ను కలిసిన యువ ఐఏఎస్​ల బృందం - డీజీపీ సవాంగ్​ను కలిసిన యువ ఐఏఎస్​ల బృందం

ప్రజల కోసం ప్రభుత్వాలు చేపట్టే పథకాలు ప్రతిఒక్కరికీ చేరేవిధంగా సేవాభావంతో ముందుకు సాగాలని యువ ఐఏఎస్​లకు డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఎదురయ్యే పరిస్థితులు.., వాటిని ఏ రకంగా ఎదుర్కొనాలి అనే దానిపై వారికి దిశానిర్దేశం చేశారు.

డీజీపీ సవాంగ్​ను కలిసిన యువ ఐఏఎస్​ల బృందం
డీజీపీ సవాంగ్​ను కలిసిన యువ ఐఏఎస్​ల బృందం

By

Published : May 23, 2020, 11:23 PM IST

శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరుతున్న 2019 బ్యాచ్​కు చెందిన 10 మంది ఐఏఎస్ అధికారుల బృందం డీజీపీ గౌతమ్ సవాంగ్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఎదురయ్యే పరిస్థితులు.., వాటిని ఏ రకంగా ఎదుర్కొనాలి అనే దానిపై డీజీపీ యువ ఐఏఎస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మహిళలకు భరోసా కల్పించేందుకు, వారి రక్షణ కోసం ప్రవేశపెట్టిన దిశ చట్టం విధివిధానాలను వారికి వివరించారు.

అధికారులపైన ప్రజలకు ఎక్కువ అంచనాలు ఉంటాయన్నారు. వారికి సేవ చేసేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని బాధ్యతగా స్వీకరించి ప్రజల కోసం ప్రభుత్వలు చేపట్టే పథకాలు ప్రతిఒక్కరికీ చేరేవిధంగా సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. ఐఏఎస్ అధికారుల బృందంలో మహిళలు ఎక్కువశాతం ఉండటం అభినందనీయమన్నారు. అంధత్వాన్ని జయించి ఐఏఎస్​కు ఎంపికై విధుల్లో చేరబోతున్న ఆంధ్రప్రదేశ్​కు చెందిన కట్ట సింహాచలం ప్రతి ఒక్కరికి ఆదర్శమని కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details