భాగ్యనగరంలో చిక్కుకుపోయిన వారు స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రజారవాణా లేకపోవడం వల్ల ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. గతంలో హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లేందుకు ఈ వాహనాలు కిలోమీటరుకు రూ.10, రూ.11 చొప్పున వసూలు చేసేవారు. ఇప్పుడు కొందరు వాహనదారులు రూ.16 నుంచి రూ.18కి పెంచేశారు. దీనికితోడు వెళ్లే మార్గంలో ఉన్న టోల్ రుసుములన్నీ ప్రయాణికులే భరించాలి. వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు అనుమతులు కూడా ప్రయాణికుల బాధ్యతనే. ఇది అత్యవసరంగా వెళ్లాల్సిన వారికి ఇబ్బందిగా మారుతోంది.
ఇక్కడ ఓ అపార్ట్‌మెంట్‌లో పనిచేసేందుకు నా భార్యతో వచ్చాను. తనిప్పుడు గర్భవతి. డెలివరీ సమయానికి సొంతూరికి వెళ్లిపోవాలనుకున్నాం. నెలలు నిండాయి. ఇక వెళ్లిపోదామనుకునేసరికి ఈ లాక్‌డౌన్ వచ్చింది. ఇక్కడ తెలిసిన వారెవరూ లేరు. తుని ప్రభుత్వాసుపత్రిలో డెలివరీ చేపించాలనుకున్నాం. వెళ్దామని ప్రయత్నాలు చేస్తే ప్రైవేటు వాహనాలు రూ.30వేలు, రూ.40వేలు అడుగుతున్నారు.