prisoners released స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 175 మంది ఖైదీలకు ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. వారిని ఖైదు నుంచి విడుదల చేయాల్సిందిగా ఆదేశిస్తూ హోం శాఖ కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నియమించిన స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు స్వేచ్ఛ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే విడుదల అవుతున్న ఖైదీలు ఒక్కొక్కరు రూ.50 వేల వ్యక్తిగత పూచికత్తు జమ చేయాలని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 175 మంది ఖైదీలకు క్షమాభిక్ష - ఖైదీలకు క్షమాభిక్ష వార్తలు
prisoners released స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలకు రాష్ట్రప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. 175 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ..వారిని విడుదల చేయాల్సిందింగా హోంశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
ఖైదీలకు క్షమాభిక్ష
జీవిత ఖైదు శిక్షా కాలం ముగిసేంత వరకూ విడుదలైన వ్యక్తులు 3 మాసాలకు ఓసారి సంబధిత పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. విడుదలైన ఖైదీల ఏదైనా నేరపూరిత చర్యలకు పాల్పడితే తక్షణమే రీ అరెస్టుకు బాధ్యులు అవుతారని పేర్కొంది. మరోవైపు అజాదీ కా అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సత్ప్రర్తన కలిగిన మరో 20 మంది ఖైదీల విడుదలకూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఇవీ చూడండి