ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతి సమస్యకు ప్రధాని మోదీ పరిష్కారం చూపాలి: అయ్యన్న

రాజధాని అమరావతికి జరుగుతున్న అన్యాయంపై ప్రధాని మోదీ మౌనం వీడాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. రాజధాని సమస్యకు ప్రధాని మోదీ పరిష్కారం చూపాలని కోరారు. అమరావతి అభివృద్ధిలో కేంద్ర భాగస్వామ్యం ఉన్నందున సమస్యను పరిష్కరించేందుకు ప్రధాని పెదన్న పాత్ర పోషించాలన్నారు.

అమరావతి సమస్యకు ప్రధాని మోదీ పరిష్కారం చూపాలి
అమరావతి సమస్యకు ప్రధాని మోదీ పరిష్కారం చూపాలి

By

Published : Dec 14, 2020, 7:12 PM IST

అమరావతి సమస్యకు ప్రధాని మోదీ పరిష్కారం చూపాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు కోరారు. రాజధాని అమరావతికి జరుగుతున్న అన్యాయంపై మోదీ మౌనం వీడాలన్న ఆయన...,మట్టి, నీళ్లు ఇచ్చి శంకుస్థాపన చేసిన ప్రధానికి స్పందించాల్సిన బాధ్యత ఉందన్నారు. దిల్లీని మించిన రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తానని తిరుపతి సభలో ప్రధాని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అమరావతి అభివృద్ధిలో కేంద్ర భాగస్వామ్యం ఉన్నందున సమస్యను పరిష్కరించేందుకు ప్రధాని పెదన్న పాత్ర పోషించాలని స్పష్టం చేశారు.

అమరావతిపై గంటకోమాట మాట్లాడటం భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుకు తగదని హితవు పలికారు. రాజకీయాల కోసం రాష్ట్రాన్ని బలి చేయవద్దని సూచించారు. మానవత్వం ఉన్న మనుషులంతా రైతుల ఉద్యమానికి మద్దతు తెలపాలన్న అయ్యన్న....,రాక్షస ముఖ్యమంత్రి చేతుల్లో అమరావతి రైతులు దగా పడ్డారని ధ్వజమెత్తారు. రాజధానిలో భూములిచ్చిన అత్యధికులు ఎస్సీలేనని.., భూదోపిడీ కోసమే విశాఖ రాజధాని అంటున్నారని ఆయన ఆరోపించారు. అమరావతి రైతులు ఎన్నో అవమానాలు భరించి చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేస్తున్నారని కొనియాడారు. రాజకీయాలు, పార్టీలకతీతంగా వారికి సహకరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

పోలవరం ప్రాజెక్టును 45.72మీటర్ల ఎత్తులో 194 టీఎంసీల నీటి నిల్వతో కడతామని చెప్పే దమ్ము జగన్, ఎంపీ విజయసాయిలకు ఉందా? అని సవాల్ విసిరారు.

ఇదీచదవండి

పోలవరం ఎత్తు ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గదు: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details