విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు.
విజయవాడ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - విజయవాడలో అగ్ని ప్రమాదం
విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంపై సీఎం జగన్‌కు ఫోన్ చేసిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. హోటల్‌ను ప్రైవేటు ఆస్పత్రి లీజుకు తీసుకుని కరోనా బాధితులను ఉంచిందని సీఎం వివరించారు.
అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. సీఎం జగన్‌కు ఫోన్ చేసిన అగ్నిప్రమాద వివరాలను సీఎంను అడిగి తెలుసుకున్నారు. రూ.50 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించామని ప్రధానికి సీఎం జగన్ తెలిపారు. హోటల్‌ను ప్రైవేటు ఆస్పత్రి లీజుకు తీసుకుని కరోనా బాధితులను ఉంచిందని సీఎం అన్నారు. అధికారులు వెంటనే సహాయక చర్యలను చేపట్టారని ప్రధానికి సీఎం జగన్ వివరించారు. దురదృష్టవశాత్తు కొంతమంది మృత్యువాత పడ్డారని ప్రధానికి తెలిపారు.
ఇదీ చదవండి: కొవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య