ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఛైర్మన్, జీర్ణకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డికి అత్యంత ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సంస్థ ‘అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్సెస్(ఏఏఏఎస్)’లో స్థానం దక్కింది. నోబెల్ పురస్కార గ్రహీతలు, అంతర్జాతీయ ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలకు మాత్రమే ఈ సంస్థలో ఫెలోషిప్ దక్కుతుంది. జీర్ణకోశ వ్యాధుల చికిత్సలో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 2020 సంవత్సరానికిగానూ ఫెలోషిప్ అందజేస్తున్నట్లుగా ఏఏఏఎస్ ప్రకటించింది. ఫిబ్రవరి 13, 2021న నిర్వహించనున్న కార్యక్రమంలో అధికారిక ధ్రువపత్రంతోపాటు శాస్త్ర సాంకేతికకు ప్రతీకగా రూపొందించిన బంగారం, నీలి రంగుతో కూడిన బ్యాడ్జిని ఆయనకు అందజేస్తారు. గడిచిన 50 ఏళ్లలో ఈ ఘనత సాధించిన ఏకైక భారత వైద్యుడు డాక్టర్ నాగేశ్వరరెడ్డి అని ఏఐజీ వర్గాలు వెల్లడించాయి.
డాక్టర్ నాగేశ్వరరెడ్డికి ప్రతిష్ఠాత్మక ఏఏఏఎస్ ఫెలోషిప్ - Prestigious AAAS Fellowship to Dr. Nageswarareddy
ప్రతిష్ఠాత్మక ఏఏఏఎస్ ఫెలోషిప్‌ను జీర్ణకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి కైవసం చేసుకున్నారు. జీర్ణకోశ వ్యాధుల చికిత్సల్లో విశిష్ట సేవలకు గుర్తింపుగా 2020 సంవత్సరానికిగానూ ఫెలోషిప్ అందజేస్తున్నట్లుగా ఏఏఏఎస్ ప్రకటించింది.
![డాక్టర్ నాగేశ్వరరెడ్డికి ప్రతిష్ఠాత్మక ఏఏఏఎస్ ఫెలోషిప్ Prestigious AAAS Fellowship to Dr. Nageswarareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9814400-918-9814400-1607480443656.jpg)
డాక్టర్ నాగేశ్వరరెడ్డికి ప్రతిష్ఠాత్మక ఏఏఏఎస్ ఫెలోషిప్