నేటినుంచి అందుబాటులో ప్రీమియం బ్రాండ్ల మద్యం...కారణమదే..! - andhrapradesh wines
14:41 December 31
పొరుగు రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ జరుగుతుండటంతో ఏపీలోనే విక్రయానికి అనుమతి
ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ప్రీమియం బ్లాండ్ల మద్యం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర అబ్కారీ శాఖ అనుమతి జారీ చేసింది. ఇక నుంచి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ చెందిన మద్యం దుకాణాలు, ఇతర రీటైల్ అవుట్ లెట్లతో సహా బార్లు, వాకిన్ స్టోర్లలో ప్రీమియం బ్రాండ్ల మద్యం విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రీమియం బ్రాండ్ల మద్యం... పొరుగు రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ జరుగుతుండటంతో వాటిని రాష్ట్రంలోనే విక్రయించేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో ఇవాళ్టి నుంచి ప్రీమియం బ్రాండ్ల మద్యం విక్రయాలు అన్ని మద్యం దుకాణాల్లో జరుగనున్నాయి.
ఇదీచదవండి: man suicide attempt: ఎస్పీ కార్యాలయం ఆవరణలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం..