ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తొలి దశ పల్లెపోరు ఖరారు.. ప్రచారంలో అభ్యర్థులు! - కృష్ణా జిల్లా పంచాయతీ పోరు

తొలిదశ పల్లెపోరు ఖరారైంది. నామినేషన్ల ఘట్టం పూర్తిగా ముగిసింది. ప్రచార పర్వానికి తెరలేచింది. నువ్వానేనా అన్నట్లు ఓట్లవేటకు బయలు దేరారు. తొలి దశలో అంచనా కంటే ఏకగ్రీవాలు తగ్గాయి. చివరి రోజులు వివిధ కారణాలతో పలు పంచాయతీలను ఏకగ్రీవం చేశారు. విజయవాడ డివిజనులో మొత్తం 22 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో వైకపా మద్ధతుదారులు 20 మంది ఉండగా తెదేపా మద్ధతు దారులు ఒకరు, ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. వీటిలోకొన్ని రెండు పార్టీల మద్ధతుదారులు ఒక అవగాహనకు వచ్చి సర్పంచ్, ఉపసర్పంచ్‌ పదవులను పంచుకున్నారు. కొన్ని పంచాయతీల్లో సమయం ముగిసిన తర్వాత కూడా ఏకగ్రీవం చేశారన్న ఫిర్యాదులు వచ్చాయి. గడువులోగా ఉపసంహరణ పత్రాలు అందినట్లు అధికారులు చెబుతున్నారు.

తొలిదశ నామినేషన్లు
తొలిదశ నామినేషన్లు

By

Published : Feb 5, 2021, 9:55 AM IST

తొలిదశ పల్లె పోరు ఖరారైంది. ప్రచార పర్వానికి తెరలేచింది. తొలి దశలో అంచనాకంటే ఏకగ్రీవాలు తగ్గాయి. విజయవాడ డివిజనులో మొత్తం 22 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో వైకాపా మద్దతుదారులు 20 మంది ఉండగా తెదేపా నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు ఉన్నారు. వీటిలోకొన్ని రెండు పార్టీల మద్దతుదారులు అవగాహనకు వచ్చి సర్పంచి, ఉపసర్పంచి పదవులను పంచుకున్నారు. కొన్ని పంచాయతీల్లో సమయం ముగిసిన తర్వాత కూడా ఏకగ్రీవం చేశారన్న ఫిర్యాదులు వచ్చాయి.

ప్రసాదంపాడు ఆఖరి నిమిషంలో ఏకగ్రీవం చేశారు. ఇక్కడ వైకాపా మద్దతుతో ఉమ్మడి అభ్యర్థినిగా తెదేపా సానుభూతిపరులు ఎస్‌.గంగారత్నం ఏకగ్రీవం అయ్యారు. బుధవారం వరకు కేవలం అయిదు పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. చివరి రోజు సంప్రదింపులు, చర్చల ద్వారా 17 పంచాయతీలు ఏకగ్రీవం చేయడం గమనార్హం. దాదాపు 250 వార్డుల వరకు ఏకగ్రీవం అయ్యాయి. జిల్లాలో తొలి విడత మొత్తం 234 పంచాయతీలు, 2502 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. గురువారంనాటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. వార్డుల ఏకగ్రీవాల లెక్కలు ఇంకా తేలలేదు. ఉపసంహరణల ఘట్టం ముగిసిన తర్వాత అభ్యర్ధులకు గుర్తులు కేటాయించారు. దీంతో ప్రచారంలోకి దూకారు. గుర్తులతో పాటు పార్టీ జెండాలు చేతపట్టారు. తొలిదశలో ఈనెల 7వతేదీ సాయంత్రం వరకు ప్రచారానికి అవకాశం ఉంది. ఈనెల 9న పోలింగ్‌ జరుగనున్న విషయం తెలిసిందే.

ఎవరి ప్రయత్నాలు వారివి..

సర్పంచి అభ్యర్ధి ఎవరు.. ఎవరికి ఏ పార్టీ మద్దతు ఇస్తుంది ఇలా గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. పార్టీ గుర్తులపై నిలబడక పోయినా పార్టీల ప్రభావం మాత్రం ఉంటుంది. అందుకే ఎవరికి వారు మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలన్న లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నారు. బందరు డివిజన్‌కు నోటిఫికేషన్‌ గడువు సమీపించడంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారు. తమ పట్టు నిలబెట్టుకోవాలని అధికార పార్టీ, తమ సత్తా చూపించాలని ప్రతిపక్ష పార్టీ నాయకులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.

బందరు మండలంలో 34 పంచాయతీలు ఉండగా నగరపాలక సంస్థ విలీన ప్రతిపాదిత పంచాయతీలైన పోతేపల్లి, మేకావానిపాలెం, పెదకరగ్రహారం, చినకరగ్రహారం, గరాలదిబ్బ, రుద్రవరం, ఎస్‌ఎన్‌గొల్లపాలెం, అరిసేపల్లి, సుల్తానగరం గ్రామాలు మినహా మిగిలిన 25 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలు జరిగే పంచాయతీల్లో రిజర్వేషన్ల వారీగా గ్రామాల్లో పట్టున్న వారిని నిలబెట్టేందుకు సమాలోచనలు చేస్తున్నారు.

బహుముఖ పోరు

అధికార పార్టీ వైకాపాతోపాటు ప్రతిపక్షమైన తెదేపా నుంచి సర్పంచి అభ్యర్థిత్వం కోసం పలు గ్రామాల్లో బహుముఖ పోరు కనిపించడంతో ఆయా పార్టీల నాయకులు తలలు పట్టుకుంటున్నారు. పలు గ్రామాల్లో నాయకులు వర్గాలుగా విడిపోయి సర్పంచి పదవి కోసం పోటీపడుతున్నారు. వారికి నచ్చజెప్పేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. మండలంలోని కాపులకోన నుంచి అధికార పార్టీ తరఫున నిలబడేందుకు ఇరువురు పోటీ పడటంతో విషయం మంత్రి పేర్ని వద్దకు చేరింది. చాలా గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తెదేపా తరఫున కూడా తాళ్లపాలెం, సీతారామపురం గ్రామాల్లో కూడా ఒకరికి ఇద్దరు పోటీపడటంతో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణరావు తదితరులు వారితో సంప్రదింపులు చేస్తున్నారు. భాజపా, జనసేన పార్టీల మద్దతుతో పంచాయతీ బరిలో నిలిచేందుకు అభ్యర్థులు సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో మాత్రం స్తబ్థత కనిపిస్తోంది.

ఇదీ చదవండి:

ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్ల‌ రిజర్వేషన్‌కు.. అందుబాటులోకి కొత్త వెబ్‌సైట్‌!

ABOUT THE AUTHOR

...view details