ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గర్భిణీ నేలపై పడి చనిపోయినా పట్టించుకునే వారే లేరు: చంద్రబాబు - chandrababu responded on pregnant lady died vijawada news

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని కొవిడ్ ఐసోలేషన్ కేంద్రంలో దారుణం జరిగింది. గర్భిణీ నేలపై పడి చనిపోయి 3 గంటలు దాటినా ఎవరూ స్పందించలేదు. చనిపోయిన రోగి వీడియోను ఇతర రోగులు చిత్రీకరించిన దృశ్యాలు తనను ఆవేదనకు గురి చేశాయంటూ చంద్రబాబు ట్విట్టర్ లో పోస్టు చేశారు.

pregnant died in  kovid isolation center
గర్భిణీ నేలపై పడి చనిపోయి 3 గంటలు దాటినా ఎవరూ స్పందించలేదు: చంద్రబాబు

By

Published : Jul 22, 2020, 5:52 PM IST

గర్భిణీ నేలపై పడి చనిపోయి 3 గంటలు దాటినా ఎవరూ స్పందించలేదు: చంద్రబాబు

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి కొవిడ్ ఐసోలేషన్ కేంద్రంలో 8 నెలల గర్భిణీ నేలపై పడి చనిపోయి 3 గంటలు దాటినా ఎవ్వరూ స్పందించక పోవటం దారుణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన రోగి వీడియోను ఇతర రోగులు చిత్రీకరించారని.., ఆ దృశ్యాలు తనను ఎంతో కలచి వేశాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

దీనికి సంబంధించిన వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్ లో పోస్ట్‌ చేశారు. గర్భిణీ వాంతులు చేసుకుని చనిపోయిందని, ఇంకా ఆమెకు సహాయం చేయడానికి సిబ్బంది రాలేదంటూ... తోటి రోగులు బాధపడుతూ ఈ వీడియో పెట్టారన్నారు. ఈ దృశ్యాలు ఎంతో భయంకరంగా, దయనీయంగా ఉన్నాయని పేర్కొన్నారు.

గర్భిణీ నేలపై పడి చనిపోయి 3 గంటలు దాటినా ఎవరూ స్పందించలేదు: చంద్రబాబు

ఇవీ చూడండి- రాజ్యాంగ గౌరవం, కోర్టుల ఔన్నత్యాన్ని నిలబెట్టడం సంతోషం: చంద్రబాబు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details