ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధకులుగా పనిచేస్తున్న వైద్యులకు యూజీసీ ప్రకారం పీఆర్సీ ఇవ్వటంపై ఏపీ ప్రభుత్వ కళాశాలల వైద్యుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం వల్ల 3,500 మంది వైద్యులకు లబ్ధి చేకూరుతుందని సంఘం కార్యదర్శి డా. స్వరూప్ కాంత్ అన్నారు.
నాన్ క్లినికల్ వైద్యులకు అలవెన్సులు ఇవ్వటం మంచి పరిణామమని చెప్పారు. 2016 నుంచి రావాల్సిన పీఆర్సీ సమస్య పరిష్కరించినందుకు ఆనందంగా ఉందన్నారు. వైద్య రంగంలో మెరుగైన బోధన అందించేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.