ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా అక్రమ నిర్మాణాల కూల్చివేత అంటూ... ప్రజలను మభ్య పెట్టేందుకు వైకాపా ప్రయత్నిస్తుందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆరోపించారు. ప్రజావేదిక నిర్మాణం కూల్చివేతపై స్పందించిన ఆయన రాష్ట్రంలో ఇదొక్కటే అక్రమ నిర్మాణం అన్నట్లు ముఖ్యమంత్రి అత్యుత్సాహం ప్రదర్శించడం సరైంది కాదన్నారు. రైతులు మూడు నెలలుగా అమ్మిన ధాన్యానికి డబ్బు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సకాలంలో విత్తనాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. వాలంటీర్ల పేరుతో రేషన్ డీలర్ల విధానాన్ని రద్దు చేయడం సరైన పద్ధతి కాదని.. దీనిపై ముఖ్యమంత్రి పునరాలోచించాలని సూచించారు.
'ప్రజలను మభ్యపెట్టేందుకే..ప్రజావేదిక కూల్చివేత' - just to lure people
ప్రజావేదిక కూల్చివేతపై మాజీ శాసనసభ్యలు బోడె ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై దృష్టి పెట్టకుండా వైకాపా ప్రభుత్వం ఇలాంటి చర్యలతో ప్రజలను మభ్యపెడుతుందని మండిపడ్డారు.
మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్