ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విద్యుత్​ సంస్థల ప్రైవేటీకరణను ప్రభుత్వం వ్యతిరేకించాలి' - విజయవాడ తాజా వార్తలు

విద్యుత్ సవరణ బిల్లు-2020ను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని విజయవాడలో విద్యుత్తు ఉద్యోగులు నిరసన తెలిపారు. అలాగే విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకుంటే.. నవంబర్ 9వ తేదీ నుంచి రిలే నిరాహారదీక్షలు చేపడతామన్నారు.

power employees  protest in Vijayawada
power employees protest in Vijayawada

By

Published : Nov 7, 2020, 4:53 PM IST

విజయవాడలో రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. విద్యుత్ సవరణ బిల్లు-2020ను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని, అలాగే విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఫిబ్రవరి 1999 నుంచి ఆగష్టు 2004 మధ్య ఉద్యోగులకు జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి వైద్యం అందించాలన్నారు. కరోనాతో మృతి చెందిన ఉద్యోగులకు పరిహారం అందజేయాలని కోరారు. ఈ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకుంటే.. నవంబర్ 9వ తేదీ నుంచి రిలే నిరాహారదీక్షలు చేపడతామని చీఫ్ ఇంజనీర్ భాస్కర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details