ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

POWER PEAK DEMAND: వర్షాకాలంలోనూ.. పెరిగిన విద్యుత్​ వినియోగం

రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 8,365 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ ఉన్నట్లు ఏపీ ట్రాన్స్‌కో తెలియజేసింది. వర్షాకాలమైనప్పటికీ రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం పెరుగుతూనే ఉందని ఇంధన శాఖ వెల్లడించింది.

POWER PEAK DEMAND
POWER PEAK DEMAND

By

Published : Oct 6, 2021, 8:54 PM IST

వర్షాకాలంలోనూ రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం సగటున రోజూ 8,400 మెగావాట్ల వరకూ విద్యుత్తును వినియోగిస్తున్నట్టు ఏపీ ట్రాన్స్‌కో స్పష్టం చేస్తోంది. ఇవాళ ఒక్కరోజే గరిష్ఠంగా 8,365 మెగావాట్ల విద్యుత్తును ఏపీలో వినియోగించారు. అయితే ఈ సీజన్​లో విద్యుత్తు వినియోగం తగ్గాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాల రీత్యా ఈ వినియోగం పెరుగుతోందని విద్యుత్తు శాఖ చెబుతోంది. సెప్టెంబరు 18న అనూహ్యంగా గరిష్ఠస్థాయిలో విద్యుత్ వినియోగం జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఆ ఒక్క రోజులోనే 10 వేల 66 మెగావాట్ల విద్యుత్ ఆంధ్రప్రదేశ్​లో వినియోగించినట్టు ట్రాన్స్ కో వెల్లడించింది. ప్రస్తుతం రోజూ 195 మిలియన్ యూనిట్లను రాష్ట్రంలో గృహ, పరిశ్రమలు, వ్యవసాయం, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. సగటున 170 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఏపీలో వినియోగమవుతుంటే అందులో ఏపీ జెన్​కోకు చెందిన థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి సంస్థల నుంచి 47 మిలియన్ యూనిట్లు, జల విద్యుత్ కేంద్రాల నుంచి 23 మిలియన్ యూనిట్లు అలాగే సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల నుంచి 33 మిలియన్ యూనిట్లను డిస్కమ్​లు కొనుగోలు చేశాయి. అలాగే వివిధ గ్యాస్ ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నుంచి 4 మిలియన్ యూనిట్లను కొన్నారు.

సాయంత్రం వేళల్లో పీక్ డిమాండ్ ఉన్న సమయంలో విద్యుత్​ను బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్నట్లు విద్యుత్​ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఆర్టీపీపీ, వీటీపీఎస్, కృష్ణపట్నం తదితర థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కొన్ని యూనిట్లు మూతపడటంతో ప్రస్తుతం 60 మిలియన్ టన్నుల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతోంది. అక్టోబరు నెలాఖరు తర్వాత జల విద్యుత్ కేంద్రాలన్నీ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి వెళ్తే డిమాండ్ ఉన్న సమయంలో విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశముందని ఏపీ జెన్​కో అధికారులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details