విజయవాడ కనకదుర్గ ఆలయంలో మూడు టెండర్లకు ఆహ్వానించినా... నేటి వరకు వెబ్సైట్లో టెండర్ ఫారాలు లభ్యం కావటంలేదని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ పేర్కొన్నారు. టెండర్లు పిలిచి నేటికి నాలుగు రోజులవుతున్నా ఆలయ అధికారుల్లో చలనం లేదని మండిపడ్డారు. టెండర్లను మంత్రి వెల్లంపల్లి అనుచరులకు, బంధువులకు కట్టబెట్టేందుకు ఈవో సురేశ్ కుట్ర చేస్తున్నట్లుగా అనుమానం కలుగుతోందని ఆరోపించారు.
'ఆలయ టెండర్లు మంత్రి అనుచరులకు కట్టబెట్టేందుకు కుట్ర' - పోతిన మహేశ్ తాజా వార్తలు
బెజవాడ దుర్గమ్మ ఆలయంలోని టెండర్లను మంత్రి వెల్లంపల్లి అనుచరులకు, బంధువులకు కట్టబెట్టేందుకు ఈవో సురేశ్ కుట్ర చేస్తున్నట్లు అనుమానం కలుగుతోందని జనసేన నేత పోతిన మహేశ్ ఆరోపించారు. ఆలయంలో మూడు టెండర్లను ఆహ్వానించి నాలుగు రోజులవుతున్నా...ఇప్పటి వరకు టెండర్ ఫారాలు వెబ్సైట్లో పెట్టలేదన్నారు.
ఆలయ టెండర్లు మంత్రి అనుచరులకు కట్టబెట్టేందుకు కుట్ర