విజయవాడ మేయర్ పీఠాన్ని జనసేన పార్టీ గెలుచుకోవటం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థుల తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ తరపున పోటీలో ఉన్న ప్రతి కార్పొరేటర్ విజయం సాధిస్తారన్నారు. నగరానికి చెందిన కొందరు తెదేపా నేతలు అధికార పార్టీతో కుమ్మక్కై...వైకాపా అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తున్నారని ఆరోపించారు. వారి కుట్రలను తిప్పికొట్టాలంటే.. జనసేన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. అమరావతి నుంచి రాజధాని తరలివెళ్లకుండా విజయవాడ నగరం అభివృద్ధి చెందాలంటే ఒక్క జనసేన-భాజపా కూటమితోనే సాధ్యమవుతుందన్నారు.
విజయవాడ మేయర్ పీఠం దక్కించుకుంటాం: పోతిన మహేశ్ - విజయవాడ మేయర్ పీఠంపై పోతిన మహేశ్ కామెంట్స్
విజయవాడ నగరం అభివృద్ధి చెందాలంటే జనసేన-భాజపా కూటమితోనే సాధ్యమవుతుందని జనసేన నేత పోతిన మహేశ్ వ్యాఖ్యానించారు. నగర మేయర్ పీఠాన్ని జనసేన పార్టీ గెలుచుకోవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
విజయవాడ మేయర్ పీఠం దక్కించుకుంటాం