అమరావతి తరలింపును విజయవాడ ప్రజలు విస్మరించరని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రీకృతమైన అమరావతిని దారుణంగా దెబ్బతీయడం వల్లే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని మండిపడ్డారు.
జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలు.. భస్మాసుర హస్తాన్ని తెచ్చిపెట్టుకున్నారన్నారు. వైకాపా.. అభివృద్ధి వ్యతిరేక ప్రభుత్వమన్నారు. గడిచిన రెండేళ్లలో నగరంలోని ఏ నియోజకవర్గంలోనైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేశారా అని ప్రశ్నించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను అవమానిస్తూ.. పోలీస్ కేసులు, లాఠీలతో సన్మానించారన్నారు. తమను గెలిపిస్తే రహదారుల విస్తరణ సహా నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.