సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ.. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు గడువును మరోసారి సీఎం జగన్‌తోపాటు సీబీఐ కోరింది. లాక్‌డౌన్‌తో కౌంటర్ దాఖలు చేయలేకపోతున్నామని.. జగన్ తరఫు న్యాయవాది సీబీఐ కోర్టుకు తెలిపారు. మెయిల్ ద్వారా కౌంటర్‌ను సమర్పించవచ్చని రఘురామ తరఫు న్యాయవాది శ్రీవెంకటేష్ వాదనలు వినిపించారు.
జగన్ బెయిల్ రద్దుచేయాలన్న రఘురామ పిటిషన్‌పై.. విచారణ వాయిదా - సీఎం జగన్ బెయిల్ రద్దుపై రఘురామ వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా న్యూస్
![జగన్ బెయిల్ రద్దుచేయాలన్న రఘురామ పిటిషన్‌పై.. విచారణ వాయిదా సీఎం జగన్ బెయిల్ రద్దుచేయాలన్న రఘురామ పిటిషన్‌పై విచారణ వాయిదా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11902345-430-11902345-1622011553048.jpg)
సీఎం జగన్ బెయిల్ రద్దుచేయాలన్న రఘురామ పిటిషన్‌పై విచారణ వాయిదా
11:22 May 26
ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. గడువు పెంచవద్దని, జరిమానా విధించాలని కోరారు. సీబీఐ ఎందుకు కౌంటర్ వేయట్లేదో అర్థం కావట్లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐకి చివరి అవకాశాన్ని కోర్టు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ జూన్ 1కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:
Last Updated : May 26, 2021, 12:21 PM IST