జెన్‌కో ఉద్యోగులు తమ సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో వాయిదా నిర్ణయం తీసుకున్నారు. అయితే కృష్ణపట్నం విద్యుదుత్పత్తి కేంద్రం ప్రైవేటీకరణపై యథాతథంగా ఆందోళన కొనసాగిస్తామని జెన్‌కో ఉద్యోగులు స్పష్టం చేసారు.
వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ.. జెన్‌కో ఉద్యోగుల సహాయ నిరాకరణ వాయిదా - జెన్‌కో ఉద్యోగుల సహాయ నిరాకరణ వాయిదా
11:18 February 15
సహాయ నిరాకరణ కార్యక్రమం వాయిదా
విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చలకు ఆహ్వానించారు. కాసేపట్లో మంత్రి బాలినేని నివాసానికి వెళ్లనున్న ఉద్యోగులు ఆయనతో సమావేశం కానున్నారు.
సహాయ నిరాకరణకు వెళ్లాలని నిర్ణయం..
ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవటంతో ఇవాళ్టి నుంచి సహాయ నిరాకరణకు వెళ్లాలని ఏపీ జెన్ కో ఉద్యోగులు సోమవారం నిర్ణయం తీసుకున్నారు. జనవరి నెలకు చెందిన వేతనాలను ఇప్పటి వరకూ చెల్లించకపోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు. 2022 జనవరి నెలకు సంబంధించి ఇప్పటి వరకూ ప్రభుత్వం వేతనాలను చెల్లించకపోవటంంతో ఏపీ జెన్ కో కు చెందిన సంస్థల్లో సహాయ నిరాకరణ చేపట్టనున్నట్టు ఇంధన శాఖ కార్యదర్శికి ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ లేఖ రాసింది. వేతనాలు చెల్లించే వరకూ సహాయ నిరాకరణ ఉద్యమం చేపడతామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. కాగా..వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో వాయిదా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
ఇదీ చదవండి: Electricity Employees Protest: రేపటి నుంచి జెన్‌కో ఉద్యోగుల సహాయ నిరాకరణ