ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సమ్మెలు వాయిదా వేసుకోండి... ఉద్యోగులకు జెన్​కో సూచన - ap transco latest news

రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు ట్రాన్స్​కో సీఎండీ లేఖ రాశారు. సమ్మె, నిరసన ప్రదర్శనలు వాయిదా వేసుకోవాలని అందులో సూచించారు. ఉద్యోగుల డిమాండ్లపై మరోమారు చర్చలు జరిపేందుకు ఐకాసను చర్చలకు ఆహ్వానించారు.

apgenco
apgenco

By

Published : Nov 13, 2020, 10:19 PM IST

సమ్మె, నిరసన ప్రదర్శనలు వాయిదా వేసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లోని ఉద్యోగులను ఏపీ జెన్​కో యాజమాన్యం కోరింది. ఈ మేరకు ఏపీ ట్రాన్స్​కో సీఎండీ బి.శ్రీధర్ విద్యుత్ ఉద్యోగుల ఐకాసకు లేఖ రాశారు. దీపావళి పండుగతో పాటు కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఆందోళనను వాయిదా వేసుకోవాలని ఉద్యోగులను ఏపీ ట్రాన్స్​కో సీఎండీ కోరారు. కీలకమైన సమయంలో ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా విధులు నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై.. ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం మధ్య చర్చలు జరిగాయని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగుల డిమాండ్లపై మరోమారు చర్చలు జరిపేందుకు సిద్ధమని ఐకాసను ఆహ్వానించారు.

ABOUT THE AUTHOR

...view details