ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'యువతి హత్య కేసులో పోస్టుమార్టం నివేదిక కీలకం' - divya tejaswini murder case

విజయవాడ యువతి హత్య కేసులో పోస్టుమార్టం నివేదిక కీలకం కానుందని సీపీ శ్రీనివాసులు వెల్లడించారు. మరో రెండు రోజుల్లో ఈ నివేదిక వస్తుందని తెలిపారు. దీనివల్ల మృతురాలి దేహంపై గాయాల గురించి స్పష్టత వస్తుందన్నారు.

vijayawada police commissioner
vijayawada police commissioner

By

Published : Oct 21, 2020, 5:21 AM IST

విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన యువతి కేసులో పోస్టుమార్టం నివేదిక కీలకమని సీపీ శ్రీనివాసులు తెలిపారు. నిందితుడు చెప్పే విషయాలనూ నమ్మలేమని వివరించారు. యువతిది హత్యేనన్న సీపీ... దివ్య శరీరంపై మొత్తం 13 గాయాలున్నట్లు గుర్తించామన్నారు. అయితే ఆ గాయాలు తాను చేసుకుందా? లేదా? అన్నది వైద్య నివేదికలో తేలుతుందని చెప్పారు. మృతురాలి గొంతు కింద తీవ్రమైన గాయమైందని... తనకు తానుగా ఆ తరహా గాయం చేసుకోవటం కష్టసాధ్యమని సీపీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details