ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మేము మనుషులం కాదా?... మాకు రక్షణ కల్పించరా?' - విజయవాడలో రెడ్​జోన్లు

రెడ్​జోన్​లో ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా విధులు నిర్వహించాలంటే భయమేస్తోందంటూ విజయవాడ రైల్వే స్టేషన్​ ప్రాంతంలోని తపాలా ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కార్యాలయం వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ వంటి ఏర్పాట్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

postal employees protest in vijayawada for ppes
postal employees protest in vijayawada for ppes

By

Published : Apr 27, 2020, 4:13 PM IST

తమకు రక్షణ ఏర్పాట్లు చేయాలని తపాలా ఉద్యోగుల వినతి

రెడ్​జోన్​లో సరైన రక్షణ పరికరాలు లేకుండా ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ పని చేస్తున్నామని విజయవాడలో తపాలా శాఖ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతం రెడ్​జోన్​లో ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా తమతో పని చేయిస్తున్నారని రైల్వే మెయిల్ సర్వీస్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కంటైన్మెంట్ జోన్​లో ఉన్న కార్యాలయాలు మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలున్నా.. అవేమి పట్టించుకోవటం లేదని అన్నారు. కార్యాలయం వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ వంటి ఏర్పాట్లు కూడా లేవని వాపోయారు. సిబ్బందిని కుదించి తమతో రెట్టింపు చాకిరి చేయిస్తున్నారన్నారు. అలాగే రెడ్​జోన్​లోకి వస్తుంటే తమను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. 'మేము మనుషులం కాదా?... మా ప్రాణాలకు రక్షణ కల్పించరా?' అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details