కొత్తగా ఏర్పాటు చేసిన 26 జిల్లాలతో పాటు గిరిజన ప్రాంతాలన్నీ కలిపి ఒకే జిల్లా ఉండాలన్న ఆలోచన సీఎం జగన్ చేస్తున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. రానున్న రోజుల్లో మరో జిల్లా ఏర్పాటయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను, దాతల విరాళాలతో ఏర్పాటు చేసిన వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగిన ఆర్వో వాటర్ ఫ్లాంట్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
రాష్ట్రంలో మరో కొత్త జిల్లా.. గిరిజనుల కోసం ఏర్పాటు చేయవచ్చు: మంత్రి పేర్ని - గిరిజనుల కోసం ప్రత్యేక జిల్లా
13:57 April 05
26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా
గిరిజన ప్రాంతాలన్నీ ఒకే జిల్లాగా ఉండాలని సీఎం ఆలోచన. 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా ఏర్పాటయ్యే అవకాశం. రానున్న రోజుల్లో గిరిజనుల కోసం జిల్లా ఏర్పాటయ్యే అవకాశం.- పేర్ని నాని, మంత్రి
గడిచిన మూడేళ్ల పాలనలో ప్రజలకు ఎంతో చేరువగా తమ ప్రభుత్వం పని చేసిందని పేర్ని నాని వెల్లడించారు. రాష్ట్రంలోని 11 మెడికల్ కాలేజీలుకు అదనంగా మరో 16 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. విద్యా విధానంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ బడుల బాట పట్టే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.
ఇదీ చదవండి:ABV Rao: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీకి సర్కార్ షోకాజ్ నోటీసు