TS SCHOOLS: రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం మరో మూడు రోజులు సెలవులు పొడిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పలుచోట్ల వరద పరిస్థితులు ఉండటంతో మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాఠశాలలకు ప్రకటించిన మూడు రోజుల సెలవులు నేటితో ముగియనున్నాయి.
వర్షాల ఎఫెక్ట్.. తెలంగాణలో పాఠశాలలకు మరో 3 రోజులు సెలవులు - ts schools
TS SCHOOLS: తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు పొడిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
schools
గతవారం రోజులుగా వర్షాలు కురుస్తున్నందున రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు మూడురోజుల పాటు (సోమ, మంగళ, బుధవారం) సెలవులు ఇస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. తొలుత ప్రకటించిన విధంగా నేటితో సెలవుల గడువు ముగిసిపోనుండటంతో ఈ నెల 16 వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 17వ తేదీ ఆదివారం కావడంతో.. 18 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
ఇవీ చదవండి:
Last Updated : Jul 13, 2022, 3:24 PM IST